Monday, December 23, 2024

పెరిగిన రిలయన్స్ పవర్ నష్టాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రిలయన్స్ పవర్ లిమిటెడ్ నష్టాలు 2023 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే మరింత పెరిగాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థకు రూ.291.54 కోట్ల నష్టం రాగా, ప్రస్తుత త్రైమాసికంలో ఈ నష్టాలు రూ.1,136.75 కోట్లకు పెరిగాయి. ఖర్చులు పెరగడమే నష్టాలు పెరగడానికి కారణమని కంపెనీ శనివారం దాఖలు చేసిన ఎక్స్‌చేంజి ఫైలింగ్‌లో తెలిపింది. అయితే గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన మొత్తం ఆదాయం రూ.1936.29 కోట్లతో పోలిస్తే కంపెనీ ఆదాయం ఈ త్రైమాసికంలో స్వల్పంగా పెరిగి రూ.2,001.54 కోట్లకు చేరింది. కంపెనీ ఖర్చులు గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.2,126.33 కోట్లనుంచి పెరిగి రూ.3,179.08 కోట్లకు చేరుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News