Friday, November 22, 2024

ఉత్తర ఐర్లాండ్ అధినేతగా ఐరిష్ జాతీయవాది

- Advertisement -
- Advertisement -

లండన్ : ఐరిష్ జాతీయవాది ఒకరు శనివారం ఉత్తర ఐర్లాండ్ మొదటి మంత్రిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు. యూనియనిస్టులు రెండు సంవత్సరాల బాయ్‌కాట్ అనంతరం ప్రభుత్వం తిరిగి విధుల్లో పాలుపంచుకుంటున్నది. 1998 గుడ్ ఫ్రైడే శాంతి ఒప్పందం షరతుల ప్రకారం సిన్ ఫైన్ ఉపాధ్యక్షురాలు మిచెల్లి ఓనీల్ ప్రభుత్వంలో మొదటి మంత్రిగా నామినేట్ అయ్యారు. ఉత్తర ఐర్లాండ్‌లోని రెండు ప్రధాన సమాజాలు & యుకెలో కొనసాగాలని కోరుకుంటున్న బ్రిటిష్ యూనియనిస్టులు, ఐర్లాండ్‌తో ఐక్యతను వాంఛిస్తున్న ఐరిష్ నేషనలిస్టుల మధ్య అధికారం పంపిణీకి సంబంధించినది ఆ ఒప్పందం. ఐర్లాండ్ రిపబ్లిక్‌కు స్వాతంత్య్రం నేపథ్యంలో ఉత్తర ఐర్లాండ్‌ను

1921లో యుకెలో ప్రొటెస్టెంట్ మెజారిటీ భాగంగాఒక యూనియనిస్ట్‌గా ఏర్పాటు చేశారు. ఆవలి పక్షంతో ఒప్పందం లేకుండా ఒక పక్షం ప్రభుత్వాన్ని నడపలేదు. బ్రెక్సిట్‌కు సంబంధించిన వాణిజ్య సమస్యల పట్ల నిరసనసూచకంగా డెమోక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ (డియుపి) వాకౌట్ చేయడంతో గడచిన రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యకలాపాలు సగానికి కుంచించుకుపోయాయి. డియుపికి చెందిన డిప్యూటీ మొదటి మంత్రి ఎమ్మా లిటిల్ పెంగెల్లీతో ఓనీల్ అధికారం పంచుకుంటారు. ఇద్దరూ సమానులే. కానీ, 2022 ఎన్నికలలో ఉత్తర ఐర్లాండ్ అసెంబ్లీలో ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్న ఓనీల్ పార్టీ మరింత ప్రతిష్ఠాకర పదవిని నిర్వహిస్తారు. డియుపి మాజీ నేత ఎడ్విన్ పూట్స్ చాంబర్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News