Monday, December 23, 2024

100 రోజుల తరువాత కాంగ్రెస్ పని పడుతాం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/కెపిహెచ్‌బి: మోసపూరిత హామీలు, విషప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ ఆ హామీలను అమలు చేయకుండా అడ్డగోలు మా టలతో కాలం గడుపుతుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు. శనివారం కూకట్‌పల్లి ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్స్‌లో జరిగిన కూకట్‌పల్లి నియోజకవర్గం బిఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృ త స్థాయి సమావేశానికి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. ఎన్నికల ముందు 420 హా మీలు ఇచ్చి ప్రజల చేత ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి 50 రోజులు ఇ ప్పటికే పూర్తి అ యినా ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయిందన్నారు.

ఇంకా 50రోజుల వరకు వేచి చూస్తామని ఆ తరువాత కూడా హామీలు అ మలు కాకుంటే ప్రజల తరుపున పోరాటం చేస్తామన్నారు. ప్రస్తుతం కాం గ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మర్చిపోకుండా ఉండటానికి కేవలం గుర్తు చేస్తున్నామే తప్ప విమర్శలు, ఆరోపణలు చేయడం లేదన్నారు. వందరోజుల తరువాత మాత్రం ముఖ్యమంత్రి ఏభాష వాడుతున్నారో అదే భాషలో తాము ప్రశ్నిస్తామని అన్నారు. ఉచిత బస్సు పథకానికి తాము వ్యతిరేకం కాదని, కాని సరైన బస్సులు లేకుండా పథకాన్ని అమలు చేయడం వల్ల బస్సుల్లో ప్రయాణించి మహిళా సోదరిమణీలు , పురుషులు ఇబ్బందులు పడుతున్నారని, ఇంకోవైపు ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడతన్నారని ధ్వజమెత్తారు.

పరిస్థితిని అంచనా వేయకుండా అవగాహన లేకుండా అనాలోచితంగా పథకాలను అమలు చేస్తే పరిస్థితి రెంటింటికీ చెడ్డ రేవడిలా తయారవుతుందన్నారు. ఇప్పటికే 16 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని కెటిఆర్ గుర్తు చేశారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 10వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బిజెపి ఎంపిలకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవని, వాటి అధిష్ఠానాలు ఉస్కో అంటే ఉస్కో డిస్కో అంటే డిస్కో అన్నట్లుగా ఉండి తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం ఏనాడు నోరు విప్పింది లేదని విమర్శించారు. పార్లమెంట్‌లో తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడాలంటే బిఆర్‌ఎస్ ఎంపిలకే మాత్రమే సాధ్యమవుతుందన్నారు.

మెజార్టీ బిఆర్‌ఎస్ ఎంపిలను గెలిపించడం ద్వారానే రాష్ట్రం ప్రయోజనాలను సాధించుకోగలుగుతామన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని కెటిఆర్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ప్రజలకు కరెంట్, నీళ్ళు, మౌలిక సదుపాయల కల్పనలో ఇబ్బంది కలిగించినా కృష్ణారావుతో పాటు 39 మంది శాసన సభ్యులం అంతా గొంతు వినిపిస్తామన్నారు. హైదరాబాద్‌లో హ్యాట్రిక్ విజయం సాధించినా జిల్లాల్లో అక్కడక్కడ స్వల్ప తేడాతో ఓటమి చెంది అధికారం చేపట్టలేకపోయామని, అయినంత మాత్రాన అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ చీకటి ఉంటే వెలుగు విలువ తెలుస్తుందని ఇప్పుడు ప్రజలకు బిఆర్‌ఎస్ పాలన విలువ తెలిసివస్తుందన్నారు. నగరంలో ఇప్పుడిప్పుడే నీళ్ళ కటకట, కరెంట్ సమస్యలను చూస్తున్నామని, మన్ముందు మరెన్నీ చూడాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని కృష్ణారావు అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News