Monday, November 25, 2024

పేటిఎంకు కష్టాలు

- Advertisement -
- Advertisement -

మనీలాండరింగ్, కెవైసి లేకుండా లక్షలాది ఖాతాల సృష్టి
ఈడి, ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన ఆర్‌బిఐ

న్యూఢిల్లీ : ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) చర్యలు ఎదుర్కొంటున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు కష్టాలు మరింత పెరగనున్నాయి. సరైన ధృవీకరణ పత్రాలు లేకుం డా ఈ పేమెంట్ బ్యాంక్ లక్షలాది ఖాతాలు సృష్టించినట్టు రిజర్వు బ్యాంక్ గుర్తించింది. కెవైసి నిబంధనలను పాటించకుండా ఖాతా లు, ఒకే పాన్ కార్డుతో అనేక ఖాతాలు ఇవ్వ డం గుర్తించిన ఆర్‌బిఐ పేటీఎంపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఆర్‌బిఐ తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)కి ఈ సమాచారం అందించింది. బ్యాంకులో పెద్ద సంఖ్యలో ఇన్‌యాక్టివ్ ఖాతాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. మనీలాండరింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలు దొరికితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఈడి దర్యాప్తు ప్రారంభించే అవకాశముంది. పేటీఎం పేమెం ట్స్ బ్యాంక్‌పై ఆర్థిక దుర్వినియోగం ఆరోపణలు వెలుగులోకి వస్తే, దాని దర్యాప్తును ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్)కి అప్పగించవచ్చని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. కొన్ని బ్యాంకు ఖాతాలను మనీలాండరింగ్‌కు ఉపయోగించవచ్చని సెంట్రల్ బ్యాంక్ ఆందోళన చెందుతోంది. దీంతో ఆర్‌బిఐ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు హోం మంత్రిత్వ శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయానికి (పిఎంఒ) కూడా తెలియజేసింది.
మనీలాండరింగ్ ఆరోపణలను ఖండించిన పేటీఎం
పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లను ఇడి ఎప్పుడూ విచారించలేదని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రతినిధి తెలిపారు. ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్న కొందరు వ్యాపారులు విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై అధికారులకు ఎప్పటికపుడు సమాధానాలు ఇచ్చామని అన్నారు. మనీలాండరింగ్ ఆరోపణలను ఖండిస్తున్నామని అన్నారు. నిబంధనలను పాటించడంలో పేటీఎం బ్యాంక్ విఫలమైందంటూ ఆర్‌బిఐ జనవరి 31న ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత ఏ కస్టమర్ ఖాతాలోనూ ఎలాంటి డిపాజిట్ అంగీకరించకూడదు. బాహ్య ఆడిటర్ల నివేదిక ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆర్‌బిఐ ఆదేశించింది. అలాగే, కస్టమర్ తన ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు పూర్తి స్వేచ్ఛను అందించారు. కస్టమర్‌లు తమ పొదుపు, కరెం ట్, ప్రీపెయిడ్, ఫాస్ట్‌ట్యాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌సిఎంసి) నుండి ఎలాంటి సమస్య లేకుండా డబ్బును తీసుకునేందుకు అవకాశం కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News