Friday, December 20, 2024

చిలీలో కార్చిచ్చుకు.. 46 మంది మృతి

- Advertisement -
- Advertisement -

వినా డెల్ మార్ : దక్షిణ అమెరికా ఖండం లోని చిలీ దేశాన్ని కార్చిచ్చు దహిస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెలరేగిన కార్చిచ్చు అదుపు లోకి రావడం లేదు. మంటల్లో ఇప్పటివరకు కనీసం 46 మంది మృతి చెందినట్టు చిలీ అధ్యక్షుడు బోరిక్ గాబ్రియెల్ వెల్లడించారు. దాదాపు 1100 ఇళ్లు కాలిబూడిదై పోగా46 మంది మృతి చెందినట్టు వెల్లడి ంచారు. వేలాది మంది గాయపడ్డారని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

వాల్పరైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతుండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు. చిలీ మధ్య, దక్షిణ ప్రాంతాల్లో దాదాపు 92 కార్చిచ్చులు చెలరేగినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రి కరోలినా వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ పరిస్థితులను దయనీయంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 43 వేల హెక్టార్ల అడవులు ప్రభావితమైనట్టు చెప్పారు. ఇక తీర ప్రాంత పర్యాటక నగరం వినాడెల్ మార్‌లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, గత దశాబ్ద కాలంలో దేశంలో చెలరేగిన కార్చిచ్చుల్లో అత్యంత దారుణమైనది ఇదేనని చిలీ డైజాస్టర్ మేనేజ్‌మెంట్ తెలియజేసింది. చిలీలో కార్చిచ్చు సర్వసాధారణం. గత ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా 4 లక్షల హెక్టార్ల మేర అడవులు దగ్ధమయ్యాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News