- Advertisement -
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సోమవారం కవిత పిటిషన్ సుప్రీంలో హియరింగ్ కు వచ్చింది. ఈ పిటిషన్ పై కవిత తరుపు లాయర్, ఈడీ తరుపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు.
ఇరు వర్గాల న్యాయవాదుల వాదనల అనంతరం ధర్మాసనం కవిత పిటిషన్ పై విచారణను ఫిబ్రవరి 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తలిపింది. ఈ రోజు కవిత పిటిషన్ పై పూర్తి విచారణ జరపనున్నట్లు కోర్టు వెల్లడించింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణను తప్పుబడుతూ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
- Advertisement -