Sunday, December 22, 2024

వైఎస్ సునీత ఫిర్యాదుపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టింగ్‌లు పెడుతున్న విషయంపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు వైఎస్ సునీత ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును తీసుకున్న పోలీసులు 509,506 ఐపిసి, 67 ఐటి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. తమని, సోదరి షర్మిలను చంపుతామని సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్న వర్రా రవీందర్‌రెడ్డిపై వైఎస్ సునీత ఫిర్యాదు చేసింది. శత్ర శేషం ఉండకూడు, ఇద్దరిని లేపేయ్ అన్నాయ్…ఎన్నికలకు పనికొస్తారు అని సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టడంతో వైఎస్ సునీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News