Monday, November 18, 2024

అబద్ధాలే ఈ సర్కార్ కు పునాది

- Advertisement -
- Advertisement -

మీడియా సమావేశంలో హరీశ్ రావు

మన తెలంగాణ/హైదరాబాద్ : నీటి పారుదల అవకతవకలపై సిఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు మాజీ మంత్రి హరీశ్ రావు కౌంట ర్ ఇచ్చారు. సిఎం రేవంత్ మీడియా సమావేశంలో వితండవాదం తప్ప మరేమీ లేదని అన్నారు. కెసిఆర్‌పై సిఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని విమర్శించారు. సిఎం రేవంత్‌రెడ్డి నోరు జారినా.. రెచ్చగొట్టినా.. మేం రెచ్చిపోం.. తెలంగాణ హక్కుల కోసం పోరాడేందుకు సి ద్ధంగా ఉన్నాం. మేం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేం ప్రజల పక్షమేనన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మాట్లాడారు. ‘సిఎం సన్నద్ధత కాకుండా మీడియా సమావేశం పెట్టారు. సన్నద్ధత కాకుండా వస్తే అడ్డంగా దొరికిపోతారు. మేం మంత్రులుగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు జివో వచ్చిందని రేవంత్ అన్నారు. మేం రాజీనామా చేసి బయటకు వచ్చిన 3 నెలలకు జీవొ వచ్చింది.

తెలంగాణకు అన్యాయం చేస్తే పదవులను గడ్డిపోచల్లా వదిలేశాం. పోతిరెడ్డిపాటు కోసం వైఎస్ 2005, సెప్టెంబర్ 13న జివో తెచ్చారు. 2005 డిసెంబర్ 19వ తేదీన వైఎస్ మరోసారి జివొ తెచ్చారు. మేం 2005, జులై 4న వైఎస్ సర్కార్ నుంచి బయటకు వచ్చాం. మేం పదవుల కోసం పెదవులు మూసుకోలేదు. పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్, ఆయన మంత్రులే. పోతిరెడ్డిపాడు జివొకు వ్యతిరేకంగా అసెంబ్లీని స్తంభింపజేశామ’ని హరీశ్‌రావు గుర్తు చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కెఆర్‌ఎంబికి ఇచ్చేందుకు అధికారులు ఒప్పుకున్నారు. ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించారని పత్రికల్లో వార్తలొచ్చాయి. వార్తలు తప్పు అయితే ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వలేదు. ప్రాజెక్టులను అప్పగిండం నిజం కాకపోతే ఎందుకు స్పందించలేదు. రాష్ట్ర ప్రయోజనాలపై రేవంత్‌రెడ్డికి సోయిలేదు. కెఆర్‌ఎంబి సమావేశంలోనే ప్రాజెక్టులను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించారు కాబట్టే ఉద్యోగులు, వారికిచ్చే జీతాల ప్రస్తావన వచ్చింది. కెఆర్‌ఎంబి ప్రాజెక్టులు అప్పగించి దానిని మాయ చేసేందుకు రేవంత్ డ్రామాలు ఆడుతున్నారు. కీలకమైన కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించిన మినిట్స్‌ను చెక్ చేసుకోవాలన్న సోయి కూడా లేదా? మినిట్స్ తప్పుగా రాశారని చెప్పడం తప్పును కప్పిపుచ్చుకునే చర్య. ఒక తప్పు ను కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారు. రేవంత్ సర్కార్ డ్రామాలు ప్రజలకు తెలిసిపోయాయి. అందుకే కెసిఆర్‌పై బురద జల్లేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు.

ప్రాజెక్టులను అప్పగిస్తూ కెసిఆర్ సంతకం చేశారని సిఎం చెప్పారు. అసలు కెఆర్‌ఎంబి సమావేశానికి కెసిఆర్ హాజరు కాలేదు. ఇంతకంటే అబద్దాల ముఖ్యమంత్రి ఉంటారా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై కెసిఆర్ స్పందించలేదని సిఎం చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతలపై స్టే తీసుకొచ్చింది బిఆర్‌ఎస్ కదా..? కృష్ణాలో మన నీటి వాటా కోసం కెసిఆర్ పదేండ్లు పోరాడారు. సిఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. రేవంత్ అబద్దాలను ప్రజలు గుర్తించాలి. అబద్ధ్దాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడిపించడం సరికాదన్నారు. నాడు పోతిరెడ్డి పాడు విషయంలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోరు మెదపలేదు. పదవుల కోసం పార్టీ మారిన చరిత్ర మీది. ప్రజల కోసం త్యా గాలు చేసిన చరిత్ర మాది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చ రిత్ర మీది. ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. తెలంగాణకు అన్యాయం చేస్తుంటే పదవులను గడ్డిపోచల్లా వదిలేశాం. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే బిఆర్‌ఎస్ ప్రాధాన్యత. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో కలిసి వస్తాం. అఖిలపక్షం ఏర్పాటు చే యండి. ఢిల్లీకి వెళ్దామని సూచించారు. బేషజాలకు వెళ్లకుండా ప్రజల కు సిఎం రేవంత్ క్షమాపణలు చెప్పాల’ని హరీశ్ డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News