- Advertisement -
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సర్పంచులు అసెంబ్లీ చేరుకోకుండా పోలీసులు కట్టడి చేశారు. పంచాయతీ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. అయినా కొందరు సర్పంచులు పోలీసుల కళ్లు గప్పి అసెంబ్లీ వరకూ చేరుకుని, ముట్టడికి ప్రయత్నించారు. దాంతో పోలీసులకు, సర్పంచులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. ఈ సంఘటనలో కొందరికి గాయాలయ్యాయి. సర్పంచులను అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తమ డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ సర్పంచులు ఈ కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులను వెంటనే తమ ఖాతాల్లో జమ చేయాలని, ఈ నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందనీ వారు ఆరోపించారు.
- Advertisement -