లండన్ లో బిషప్ స్టాన్ ఫోర్ట్ రైల్వే స్టేషన్ లో ఓ రైలు ఆగిపోయింది. ఎంతకూ కదలట్లేదు. కొందరు ప్రయాణికులు రైలు దిగి చూస్తే.. రైలు ముందు పట్టాలపై ఓ హంస నిలుచుకుని ఉంది. దాన్ని అదిలిస్తే వెళ్లిపోతుంది. కానీ అందుకు ఎవరూ సాహసించలేదు. కారణం ఏమిటంటే… ఇంగ్లండ్ లో హంసలు పరిరక్షించవలసిన జాతుల జాబితాలో ఉన్నాయి మరి. పైగా వాటిని రాజసంపదగా భావిస్తారు. హంసను గాయపరిచినా, వాటికి స్వేచ్ఛకు భంగం కలిగించినా పోలీసులు కటకటాల వెనక్కి నెట్టేస్తారు. అందుకే పట్టాలపై నిలబడి ఉన్న హంసను ఎవరూ ఏమీ చేయకుండా అలా నిలబడి చూస్తూ కూర్చున్నారు. ఓ పదిహేను నిమిషాలసేపు అది పట్టాలపై దిక్కులు చూస్తూ కూర్చుంది. ఆ తర్వాత రెక్కలు విప్పుకుని ఎక్కడికో ఎగిరిపోయింది. దాంతో రైలు కదిలింది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇంగ్లండ్ లో రైళ్ల రాకపోకలకు హంసలు ఇలా అడ్డుపడటం సాధారణమేనట. పట్టాలపై అవి కనిపిస్తే చాలు… ఇంజన్ డ్రైవర్లు బ్రేకులు వేసి, అవి వెళ్లిపోయేంతవరకూ చూస్తూ కూర్చుంటారట!
View this post on Instagram