Sunday, November 24, 2024

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: ఆరుగురు మృతి, 60 ఇళ్లు నేలమట్టం

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్ లోని హర్దా జిల్లా బైరాగఢ్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా తయారు చేసే ఒక ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఆరుగురు మరణించగా 30 మంది గాయపడ్డారు. 60 ఇళ్లు, 30కి పైగా వాహనాలు కాలిబూడిదయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగిన గంటవరకూ ఫ్యాక్టరీలో పేలుళ్ళు సంభవిస్తూనే ఉన్నాయంటే ప్రమాద తీవ్రత ఎంతలా ఉందో అంచనా వేయవచ్చు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లు తెలిసింది.

‘మంగళవారం ఉదయం ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దాని కారణంగా నగరమంతటా దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. మాకు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శకటాలను, అంబులెన్సులనూ సంఘటనా స్థలానికి పంపించాం. హర్దా, బేటుల్, ఖాండ్వా, నర్మదాపురం వంటి సమీప పట్టణాలనుంచి కూడా అంబులెన్సులను, ఫైర్ ఇంజన్లనూ రప్పిస్తున్నాం. ప్రమాదానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు’ అని హర్దా పోలీస్ సూపరింటెండెంట్ సంజీవ్ కాంచన్ తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ బృందం, రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగాయి.

ఈ సంఘటనపై ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, ప్రమాద తీరుతెన్నులపై చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News