- Advertisement -
బినోని: అండర్19 వరల్డ్ కప్2024లో భాగంగా విల్లోమూర్ పార్క్ వేదికగా భారత జట్టుతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఆచితూచి ఆడుతోంది. భారత బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులతో విజృంభిస్తుండడంతో సఫారీలు బ్యాట్స్ మెన్లు నిదానంగా ఆడుతున్నారు.
ఓపెనర్ లాన్ డ్రీ ప్రీటోరయిస్(79) అర్థ శతకంతో రాణించాడు. రిచర్ట్ సీలెట్‌ష్వాన్ కూడా అర్థశతకం పూర్తి చేశాడు. ఆలివర్ వైట్‌హెడ్ తో కలిసి జట్టు స్కోరును రిచర్ట్ ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ క్రీజులో కొనసాగుతున్నారు. 45 ఓవర్లు ముగిసేసరికి దీంతో సఫారీ జట్టు 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
- Advertisement -