Saturday, December 21, 2024

ఎసిబి కస్టడీలో శివబాలకృష్ణ సంచలన విషయాలు వెల్లడి

- Advertisement -
- Advertisement -

బంధువుల పేరు మీద భారీగా ఆస్తులు
రెండు రియల్ ఎస్టేట్ సంస్థల్లో భారీగా పెట్టుబడులు
కుటుంబసభ్యుల పేర్లతో పెట్టుబడులు, షే ర్లు
శివబాలకృష్ణ కాల్‌డేటాపై ఎసిబి నజర్
మన తెలంగాణ/హైదరాబాద్ : హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏడో రోజు ఎసిబి అధికారులు విచారించారు. ఈ విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి. శివరామకృష్ణకు భారీగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నల్గొండ, మహబూబ్‌నగర్, జన గామ జిల్లాల్లో ఉన్న ఆస్తుల వివరాలు తెలుసుకున్నామని అధికారులు వెల్లడించారు. బుధవారంతో ఎసిబి అధికారులు కస్టడీ ముగియనుంది.

దీంతో, మరో ఐదు రోజులు కస్టడీని పొడిగించేందుకు కోర్టు అనుమతులు కోరనున్నట్లు సమాచారం. మరోవైపు శివబాలకృష్ణ అనుమతులిచ్చిన రియల్ ఎస్టేట్ వెంచర్లపై ఆరా తీశామని వెల్లడించారు. వీటితో పాటు కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు కూడా నిందితుడు అనుమతులు ఇచ్చి నట్లు తెలుసుకున్నామని అధికారులు చెప్పారు. మాన్యువల్ అనుమతులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న దానిపై విచారించామని వెల్లడించారు. ఒకవైపు అతని కుటుంబసభ్యులు, స్నేహితులను కలిపి విచారిస్తున్నారు. రెండు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టబడులు పెట్టినట్లు ఎసిబి గుర్తిం చింది. రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను ఎసిబి అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. లాకర్లు ఓపెన్ చేసినప్పుడు లభించిన పలు భూ పత్రాల పైనా శివబాలకృష్ణతో పాటు కుటుంబసభ్యులను ఎసిబి అధికారులు ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఇష్టమొచ్చినట్లు అనుమతులు ఇచ్చినట్లు ఎసిబి గుర్తించింది. శివబాలకృష్ణ తన బినామీల పేరిట ఆస్తులు కూడబెట్టడమే కాకుండా అపార్ట్‌మెంట్ కు అనుమతిస్తే ఫ్లాట్, విల్లాలకు అనుమతిస్తే ఓ విల్లాను తన పేరుతో రాయించుకున్నట్లు తెలుస్తోంది.

కుటుంబసభ్యుల పేర్లతో పెట్టుబడులు, షేర్లు
అవినీతి అనకొండ శివబాలకృష్ణ, హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తులను చూసి….ఏసీబీ అధికారులే మతి పోతోంది. తవ్వుతున్న కొద్దీ ఒక్కొక్కటిగా లెక్కకు మించి బయటపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల పేర్లతో భారీగా బినామీ ఆస్తులను కూడబెట్టినట్లు విచారణలో వెల్లడైంది. కుటుంబసభ్యులు, బాలకృష్ణ స్నేహితుల్ని సైతం ఏసీబీ విచారించింది. శివబాలకృష్ణతో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను కూడా ప్రశ్నించింది. ఆ సంస్థలకు లబ్ధి చేకూర్చి శివ బాలకృష్ణ వాటాలు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ప్రధానం గా రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలతో శివబాలకృష్ణ పలు లావాదేవీలు జరిపినట్టు తెలిసింది. రెండు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టబడులు పెట్టి నట్లు తేల్చా రు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎల్బీనగర్, బంజారాహిల్స్‌లోని హైరైజ్ టవర్స్‌ను నిర్మిస్తున్నాయి. పలువురు రియల్ ఎస్టేట్ కంపె నీలకు లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ బినామీల పేరిట షేర్లు కొనుగోలు చేశారు.

కాల్ డేటాపై ఎసిబి నజర్
బాలకృష్ణ సెల్‌ఫోన్ డేటాపై ఏసీబీ దృష్టి సారించింది. కాల్ డేటా తీసుకొని విచారిస్తే బినామీల వివరాలు, అండగా నిలిచిన అధికారులు, గత ప్రభుత్వంలో అండగా నిలిచిన రాజకీయ నేతలు ఎవరన్నది వెల్లడవుతుందని భావిస్తోంది. ఇప్పటి వరకు ఆయనకు 30 మంది అధికారులు సహకరించినట్లు గుర్తించారు. వీరిలో కొందర్ని ఇప్పటికే విచారించారు. బాలకృష్ణ ఇంట్లో రూ. 99.60 లక్షలు నగదు, 1988 గ్రాముల బంగారం, సిల్వర్ 6 కేజీలు సీజ్ చేశారు. 8.26 కోట్లు రూపాయలు విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఆస్తుల విలువ మార్కెట్ వ్యాల్యూలో ఇంకా ఎక్కువ ఉంది. మిగిలిన బీనామీలపై విచారణ చేస్తున్నారు.

హెచ్‌ఎండిఎ ఆఫీసులో తనిఖీలు…రియల్ ఎస్టేట్ సంస్థల మెడకు ఉచ్చు బిగిసే అవకాశం
అమీర్‌పేట స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లోని హెచ్‌ఎండిఎ ఆఫీసులో ఎసిబి తనిఖీలు నిర్వహించింది. మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఛాంబర్‌తో పాటు అధికారుల ఛాంబర్లలో రికార్డుల పరిశీలన. శివబాలకృష్ణతో పాటు పనిచేసిన ఉద్యోగులను ఎసిబి అధికారులు విచారించారు. ప్రాజెక్టుల అను మతి కోసం శివరామకృష్ణ భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఎసిబి గుర్తించింది. ఎన్నికలకు ముందు 100పైగా ఫైల్స్ క్లియర్ చేసినట్లు ఎసిబి గుర్తిం చింది. పుప్పాలగూడ, నార్సింగిలలో రూ.వెయ్యికోట్లకు పైగా విలువైన రెండు ప్రాజెక్టులకు శివబాలకృష్ణ అనుమతులు ఇచ్చినట్లు ఎసిబి గుర్తించింది. సోమవారం ఆదిత్య, ఫీనిక్స్ సంస్థ ప్రతినిధులను ఎసిబి ప్రశ్నించింది. ఆదిత్య, ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి శివబాలకృష్ణకు ముడుపులు అందినట్లుగా ఎసిబి గుర్తించింది. శివబాలకృష్ణ బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు లబ్ది చేకూర్చి కోట్ల రూపాయలు దండుకున్నట్లు ఎసిబి గుర్తించింది. శివబాలకృష్ణ వ్యవహారంతో రియల్ ఎస్టేట్ సంస్థలకు మెడకు ఉచ్చు బిగిసే అవకాశం ఉంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News