Monday, December 23, 2024

మధ్యప్రాచ్య జలాల్లో మరి రెండు నౌకలపై డ్రోన్ దాడులు

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్ : యెమెన్ హౌతీ రెబెల్స్ ప్రయోగించినట్లుగా అనుమానిస్తున్న డ్రోన్‌లు మధ్యప్రాచ్య జలాలలో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై దాడులు సాగించినట్లు అధికారులు వెల్లడించారు. వాటిలో ఒక నౌక అమె రికా నుంచి భారత్ దిశగా వెళుతున్నది. గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ పోరు నేపథ్యంలో నౌకలు లక్షంగా ఇరాన్ మద్దతు ఉన్న తిరుగుబాటుదారులు సాగించిన దాడులు అవి. మొదటి దాడి యెమెనీ రేవు హొడైదాకు పశ్చిమంగా ఎర్ర సముద్రం దక్షిణ భాగంలో జరిగింది. ఆ దాడి వల్ల నౌక కిటికీ అద్దాలు స్వల్పంగా పగిలినట్లు బ్రిటిష్ సైన్యానికి చెందిన యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యుకెఎంటిఒ) తెలియజేసింది.

దాడికి ముందుఆ నౌకకు సమీపంలో ఒక చిన్న నౌక ఉందని ఆ సంస్థ తెలిపింది. ఆ దాడిలో ఎవరికీ గాయాలు తగలలేదని సమాచారం. యెమెన్ దక్షిణ రేవు నగరం ఏడెన్ సమీపంలో మంగళవారంరెండవ నౌకపై దాడి జరిగిందని యుకెఎంటిఒ తెలిపింది. ఆ నౌకను మార్షల్ దీవుల పతాకంతో గ్రీక్ యాజమాన్యంలోని నౌకగా గుర్తించారు. అది భారత్ దిశగా యుఎస్ నుంచి వస్తున్నదని ప్రైవేట్ భద్రత సంస్థ ఆంబ్రీ తెలియజేసింది. నౌకలో ఎవరికీ గాయాలు కాలేదని, నష్టం కూడా కలగలేదని ఆ సంస్థ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News