Monday, December 23, 2024

13న బిఆర్‌ఎస్ ఛలో నల్గొండ…

- Advertisement -
- Advertisement -

భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి
పార్టీ ముఖ్యనేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టులు, నీటి హక్కులను హరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థ కెఆర్‌ఎంబికి అధికారాలు అప్పగించడం ద్వారా జరగబోయే దుష్పరిణామాలను ఖండిస్తూ తెలంగాణ సమాజానికి వివరించేందుకు నల్లగొండ పట్టణంలో ఈనెల 13న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ భవన్‌లో సమావేశం అనంతరం మంగళవారం సాయంత్రం కెసిఆర్ నందినగర్‌లోని తన నివాసంలో ఛలో నల్గొండ… భారీ బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి నల్గొండ,ఖమ్మం,మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలు, సమన్వయ కర్తలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. నల్గొండ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను అధినేత వారికి వివరించారు.ఈ సమావేశాలలో మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్‌ కుమార్, పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యోధ కవిత్వ పుస్తకం ఆవిష్కరించిన కెసిఆర్
కళ్లెం నవీన్ రెడ్డి రాసిన యోధ కవిత్వ పుస్తకాన్ని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News