Monday, November 25, 2024

ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచిన ఇసి

- Advertisement -
- Advertisement -

అజిత్ పవార్ వర్గానికి గుర్తింపుపై సంజయ్ రౌత్ ఆరోపణ

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు చెందిన వర్గాన్ని అసలైన ఎన్‌సిపిగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంపై శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచిందని ఆయన ఆరోపించారు. బుధవారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి)కి జరిగినటు వంటి అన్యాయాన్ని చరిత్రలో ఎన్నడూ చూడలేదని అన్నారు.

మరాఠా అస్తిత్వాన్ని కాపాడి మహారాష్ట్రకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పుతున్నాయన్న కారణంగానే తమ రెండు పార్టీలను బలహీనపరిచారని ఆయన ఆరోపించారు. ఎన్‌సిపి ఎమ్మెల్యేలను(శరద్ పవార్ వర్గం) అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ప్రత్యర్థి వర్గం(అజిత్ పవార్ వర్గం) ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రస్తావిస్తూ ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే బాధ్యతను అప్పగించారని ఆయన వ్యాఖ్యానించారు.

థాకరేల వెంటే అసలైన శివసేన ఉంటుందని, అదే విధంగా శరద్ పవార్‌తోనే అసలైన ఎన్‌సిపి ఉంటుందని రౌత్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు దమ్ముంటే సొంత పార్టీలు పెట్టుకుని ఎన్నికల్లో పజలను ఎదుర్కోవాలని ఆయన సవాలు చేశారు. కాగా..అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్‌సిపిగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ఎన్‌సిపి చిహ్నం గడియారాన్ని అజిత్ పవార్ వర్గానికి ఇసి కేటాయించింది.

అజిత్ పవార్ వర్గం సుప్రీంలో కేవియట్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారథ్యంలోని వర్గాన్ని అసలైన ఎన్‌సిపిగా ఎన్నికల కమిషన్ గుర్తించడాన్ని శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సిపి వర్గం సవాలు చేసిన పక్షంలో తమ వాదనలు కూడా వినాలని కోరుతూ అజిత్ పవార్ వర్గం బుధవారం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. శరద్ పవార్ వర్గం పిటిషన్ దాఖలు చేసిన అజిత్ పవార్ వర్గానికి వ్యతిరేకంగా ఎక్స్‌పార్టీ ఉత్తర్వులను సుప్రీంకోర్టు జారీ చేయకుండా నిలువరించడానికి న్యాయవాది అభికల్ప్ ప్రతాప్ సింగ్ ద్వారా అజిత్ పవార్ వర్గం ఈ కేవియట్ దాఖలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News