Monday, January 20, 2025

హెలికాప్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు మృతి

- Advertisement -
- Advertisement -

చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ధ్రువీకరించింది. నలుగురు వ్యక్తులతో కలిసి హెలికాప్టర్‌లో పినేరా ప్రయాణిస్తుండగా, అది కూలిపోయింది. దీంతో ఆయన మృతి చెందగా, మిగతా వారు గాయాలతో బయటపడ్డారు.

కన్సరేటివ్ పార్టీకి చెందిన పినేరా మొదట 2010 నుంచి 2014 వరకు, రెండోసారి 2018 నుంచి 2023 వరకు చిలీ దేశాధ్యక్షుడిగా ఉన్నారు. బిలియనీర్ అయిన ఆయన చిలీ లోని అత్యంత ధనికుల్లో ఒకరు. ఆయన మృతి పట్ల దక్షిణ అమెరికా దేశాధినేతలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News