Monday, December 23, 2024

తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా అండగా ఉంటాం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అమెరికాలో తెలుగు విద్యార్థులపై దాడులపై సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తెలుగు విద్యార్థులపై దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రతపై తమ ఆందోళనను అమెరికాకు తెలపాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. విదేశీ విద్యా ర్థుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ‘ఉన్నత చదువుల కోసమో లేక ఉద్యోగం కోసమో కన్నవాళ్లను, పుట్టిన ఊరును, తోబుట్టువులను, జీవిత భాగస్వాము లను వదిలి కెరీర్ కోసం, కుటుంబం కోసం ఎంతో మంది ప్రతిరోజు దేశాన్ని విడిచి విదేశాలకు వెళ్తున్నారు.

ఎవరూ తెలియని కొత్త ప్రదేశంలో వచ్చీ రాని భాషతో ఒక పూట తింటూ మరోపూట పస్తులుంటూ కొందరు చదువుకుంటుంటే మరికొందరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే ఇలా జీవి తంలో ఏదో సాధించాలన్న తపనతో పుట్టినగడ్డను వదిలి విదేశాలకు వెళ్లిన చాలా మందిపై అక్కడ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో కొంత మంది అక్కడే ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు తీవ్ర గాయాలపాలవుతున్నారు. చివరకు ఏ ఆశయంతో విదేశాలకు వెళ్తున్నారో అది నెరవేరక ముందే కొంత మంది గాయాలతో స్వదేశానికి తిరిగి వస్తుంటే మరికొందరు నిర్జీవంగా శవపేటికల్లో భారతగడ్డపై అడుగుపెడుతున్నార’ని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News