Monday, December 23, 2024

రైల్వే, విమాన సర్వీసుల పేరిట ఘరానా మోసం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రైల్వే, విమాన సర్వీసుల పేరిట ఘరానా మోసానికి పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్ల ముఠా గుట్టు రట్టయింది. రైల్వే, విమాన సేవలతో పాటు 300 రకాల సర్వీస్‌లను అందిస్తామని ఆన్‌లైన్ యాడ్స్‌తో మోసాలకు పాల్పడుతున్న సదరు ముఠాని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. బేగంపేట వైట్‌హౌస్ భవనంలో నిందితులు కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారని పోలీసులు వెల్లడిం చారు. వివరాల్లోకి వెళితే.. రైల్వే, విమాన సేవలతో పాటు 300 రకాల సర్వీస్‌లను అందిస్తామని ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇచ్చారు. నిజమేనని నమ్మిన బాధితులు వారిని సంప్రదించడంతో వారికి నిందితులు ముఠా ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలని, ఐడి రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో వ్యక్తి రూ.1800లు ఇవ్వాల్సి ఉంటుందని కస్టమర్లకు మాయ మాటలు చెప్పారు. ఆ తర్వాత కూడా కెవైసి వెరిఫికేషన్ అని పలు రకాల పేర్లతో వేల రూపాయలు దండుకున్నారు.

కాగా ఓ బాధితుడు ఫిర్యాదుతో డిజిటల్ సర్వీసుల బాగోతం బట్టబయలైంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. రాజస్థాన్, జైపూర్ ప్రధాన కేంద్రంగా ఐజిఎస్ డిజిటల్ సెంటర్ లిమిటెడ్ సంస్థ పేరుతో అక్రమ దందాను నిందితులు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా హైదరాబా ద్‌లోనూ కేంద్రం ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బేగంపేట వైట్ హౌస్ భవనంలో నిందితులు కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సిఇఒ ప్రతీక్, హెచ్‌ఆర్ స్వర్ణలత, శ్రావణ్ లాల్ శర్మాలను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News