Thursday, December 19, 2024

ఇఎన్‌సిలపై వేటు..!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి నీటిపారుదలశాఖలో భారీ ప్రక్షాళన చేపట్టా రు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మే డిగడ్డ బ్యారేజి కుంగుబాటులో ప్రాథమిక విచారణ లు జరిపి న విజిలెన్స్ కమిటీ అందజేసిన ప్రాథమి క నివేదిక ఆధారంగా చర్యలకు పూనుకున్నారు. తొలివేటు నీటి పారుదల శాఖలో అత్యంత కీలకస్థానంలో ఉన్నవారిపైనే పడింది. ఇఎన్‌సి మురళీధర్ రావును రాజీనామా చేయాల్సిందిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అలాగే రామగుండం ఇఎన్‌సి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్‌ఛార్జ్ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నీటిపారుదల శాఖలోని మరికొంతమంది ఇంజనీర్లపైనా చర్యలు తీసుకుంటున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ బ్యా రేజి కుంగుబాటు పై అన్ని కోణాల్లో విచారణ జరిపిన విజిలెన్స్ కొన్ని బలమైన ఆధారాలమేరకు ఇఎన్‌సిలనే బాధ్యులుగా తెల్చింది. ఇఎన్‌సి మురళీధర్ 2013లోనే రిటైర్ ఆయినప్పటికీ ఆయనను అదే స్థా నంలో ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది.

మేడిగడ్డ ప్రాజెక్టు డిజైన్లు , వాటి నిర్మాణం తదితర పనులన్నీ ఇఎన్‌సి పర్యవేక్షణలోనే జరిగాయి. గత ఏడాది అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయింది. ఈఘటనను కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహచర మంత్రుల బృందంతో స్వయంగా మేడిగడ్డ బ్యారేజిని సందర్శించారు. బ్యారేజి పియర్స్ కుంగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మంత్రుల బృందం ఇచ్చిన సమాచారం మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అక్రమాలు నిగ్గుతేల్చేందకు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు 12 టీమ్‌లుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో నీటిపారుదల ప్రధాన కార్యాలయంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన వివిధ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజిని సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు. కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

విజిలెన్స్ జరిపిన ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. విజిలెన్స్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. గురువారం నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభత్వం నీటిపారుదల శాఖలో ప్రక్షాళన చర్యలను ప్రారంభించింది. అసెంబ్లీలో నీటిపారుదల ప్రాజెక్టులపైన స్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే నీటిపారదల శాఖలో ఇఎన్‌సిలపై వేటు వేసి సంచలనం సృష్టించింది. మరికొందరు అధికారులపైన కూడా చర్యలకు సిద్ధమవుంతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News