Monday, December 23, 2024

వరవరరావు అల్లుడు ఇంట్లో ముగిసిన ఎన్ఐఎ సోదాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హిమాయత్‌నగర్‌లో వరవరరావు అల్లుడు వేణుగోపాల్ నివసంలో ఎన్‌ఐఎ సోదాలు ముగిశాయి. సుమారు ఐదు గంటల పాటు వేణు నివాసంలో ఎన్‌ఐఎ సోదాలు నిర్వహించింది. గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచే వేణు ఇంట్లో ఎన్‌ఐఎ సోదాలు చేపట్టింది. ఇటీవల మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు దీపక్‌ను అరెస్టు చేశారు. దీపక్ దగ్గర దొరికిన సమాచారం మేరు వేణు నివాసంలో ఎన్‌ఐఎ సోదాలు చేపట్టింది. ఎన్ వేణుగోపాల్ వీక్షణం పత్రికకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. వేణు సెల్‌ఫోన్‌ను ఎన్‌ఐఎ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రవి శర్మ నివాసంలోనూ ఎన్‌ఐఎ సోదాలు ముగిశాయి. రవి శర్మ, సెల్‌ఫోన్, బుక్‌లెట్, కరపత్రాలను ఎన్‌ఐఎ స్వాధీనం చేసుకుంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న నేపథ్యంలోనే ఎన్‌ఐఎ సోదాలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News