- Advertisement -
హైదరాబాద్: ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. కవిత కామెంట్లపై కొండా సురేఖ స్పందించారు. కెసిఆర్ పాలనలో తెలంగాణను సర్వనాశనం చేశారని విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాకుండానే విమర్శలు ఎందుకు చేస్తున్నారని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత కవితకు లేదని సురేఖ చురకలంటించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకే కెసిఆర్ పనులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రా కాంట్రాక్టర్లను పెంచి పోషించిందే కెసిఆర్ అని ధ్వజమెత్తారు. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ మహేందర్ రెడ్డిపై విమర్శలు సరికాదని సూచించారు. కెసిఆర్ హయాంలో మహేందర్ రెడ్డి డిజిపిగా పని చేసిన విషయం మరిచారా? అని సురేఖ ఎద్దేవా చేశారు.
- Advertisement -