- Advertisement -
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం శివాజీ నగర్ లో గురువారం దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై యువతి దారుణ హత్యకు గురైంది. ఓ ప్రేమోన్మాది యువతిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపేశాడు. యువతి టైలరింగ్ కు వెళ్లి తిరిగివస్తుండగా యువతిపై యువకుడు దాడి చేశాడు. దాడిని అడ్డుకోబోయిన బంధువు అయిన మహిళపైనా దాడికి పాల్పడ్డాడు. యువకుడి దాడిలో యువతి బంధువు, బాలుడికి గాయాలయ్యాయి. యువతిపై కత్తితో దాడి చేసి అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడి కోసం గాలిస్తున్నారు.
- Advertisement -