Sunday, January 19, 2025

ప్రభుత్వం నాలుగు రోజులు అసెంబ్లీ నిర్వహించి… : కడియం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల పాటు నిర్వహించి చేతులు దులుపుకుని వాయిదా వేయాలని ప్రభుత్వం చూస్తుందని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినప్పుడు కనీసం 12 రోజులు సమావేశాలు పెట్టాలని తాము సూచించినట్లు తెలిపారు. అవసరం అయితే మరొకసారి 13వ తేదీ బిఎసి నిర్వహిస్తామన్నారు కానీ అసెంబ్లీ 10 రోజులు పెడతామని అయితే చెప్పడం లేదన్నారు.

చాలా గ్రామాల్లో తాగు నీటి సమస్య, అధికారికంగా కరెంట్ కోతలు ఉంటున్నాయని, రాష్ట్రంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. కనీసం ప్రోటోకాల్ పాటించుకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో పాల్గొంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో ఇచ్చిన 420 హామీలపై బిఆర్‌ఎస్… ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందనే భయంతోనే సమావేశాలు త్వరగా ముగిచేందుకు ప్లాన్ చేసిందన్నారు. స్వయంగా సిఎం మాట్లాడుతూ ఓడిపోయిన మా కాంగ్రెస్ అభ్యర్థులు, మా ఎమ్మేల్యేలు అని చెప్పడంతో… ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, వారికి పాల్గొనే అర్హత లేదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News