Tuesday, January 21, 2025

ప్రపంచ సంపన్నుల జాబితాలో 12వ స్థానానికి అదానీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరోసారి 100 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన వ్యక్తుల జాబితాలో చేరారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత అదానీ ఈ క్లబ్‌లోకి తిరిగి రావడానికి ఒక సంవత్సరం పట్టింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, గౌతమ్ అదానీ నికర విలువ 2.73 బిలియన్ డాలర్లు (రూ.22.65 వేల కోట్లు) పెరిగి 101 బిలియన్ డాలర్లు అంటే రూ.8.38 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఆయన బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ల జాబితాలో 12వ స్థానానికి చేరుకున్నాడు.

ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నికర విలువ 108 బిలియన్ డాలర్లు, ఆయన ఈ జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. 205 బిలియన్ డాలర్లు అంటే రూ. 17.01 లక్షల కోట్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా ఎలోన్ మస్క్ ఉన్నారు. మస్క్ తర్వాత 196 బిలియన్ డాలర్ల (16.01 లక్షల కోట్లు) సంపదతో జెఫ్ బెజోస్ రెండో స్థానంలో, 186 బిలియన్ డాలర్ల (15.43 లక్షల కోట్లు) సంపదతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ మూడో స్థానంలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News