Monday, December 23, 2024

రాగల 24గంటల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల 24గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు విదర్భ ,పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర తెలంగాణ వరకూ సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిన ఉన్న ద్రోణి గురువారం బలహీన పడినట్టు తెలిపింది.కిందిస్థాయిలో గాలులు దక్షిణ , ఆగ్నేయ దిశలనుంచి తెలంగాణ రాష్ట్రంపైపునకు వీస్తున్నాయని తెలిపింది.

రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నప్పటీకీ, మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మరోవైపు గురువారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీలు పెరిగిపోయాయి. గ్రేటర్ పరిధిలోని జూబ్లీహిల్స్‌లో 38.4డిగ్రీలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడ 37నుంచి 38డిగ్రీల వరకూ రికార్డయ్యాయని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News