Sunday, December 22, 2024

రిజర్వేషన్ కోటాలో వివక్ష చూపకూడదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందించడంలో రాష్ట్రప్రభుత్వాలు సెలెక్టివ్‌గా(తనకు నచ్చిన వారిని గుర్తించడం)ఉండరాదని, ఎందుకంటే అదిప్రమాదకరమైన బుజ్జగింపు ధోరణికి దారి తీస్తుందని రిజర్వ్‌డ్ కేటగిరీల్లో ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా అనే అంశంపై విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.అత్యంత వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనాలను అందించే సమయంలో రాష్ట్రప్రభుత్వాలు ఇతరులను విస్మరించరాదని సిజెఐ డివై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం అభిప్రాయపడింది. ఎన్నో వెనుకబడిన వర్గాలు ఉండగా ఒకటి రెండు వర్గాలకు ఆ సదుపాయాన్ని అందించాలని రాష్ట్రప్రభుత్వాలు భావించడం సరికాదని ధర్మాసనం స్పష్ట చేసింది. అంతేకాదు ఒక రాష్ట్రం కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తే, మరో రాష్ట్రం వేరే వర్గాలకు ఆ సదుపాయం కల్పించే ప్రమాదం ఉందని, దీనివల్ల గందరగోళ పరిస్థితులు ఎదురు అవుతాయని అభిప్రాయపడింది. ఆ ప్రయోజనాలు లభించని వారు దాన్ని కోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు రిజర్వేషన్లు ఇవ్వడం కోసం ఎస్‌సి, ఎస్‌టిలలో ఉపకులాల వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు గురువారం వాయిదా వేసింది.

ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాస నం ఈ అంశంపై విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అటార్నీ జనరల్ ఆర్ వెంకట రమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియ ర్ న్యాయవాది కపిల్ సిబల్‌తో పాటుగా ఈ అంశంపై పిటిషన్లు దాఖలు చేసిన వివిధ రాష్ట్రప్రభుత్వాల తరఫు న్యాయవాదుల వాదనలను వినింది. పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌తో కలిపి మొత్తం 23 పిటిషన్లను ధర్మాసనం విచారిస్తోంది.

ధర్మాసనంలో న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, బేలా ఎం త్రివేది, పంకజ్ మిథల్, మనోజ్ మిశ్రా, సతీశ్ చంద్ర మిశ్రా ఉన్నారు. బలహీనమైన వారికి ప్రాధాన్యత ఇచ్చేందుకు కేంద్ర జాబితాలోని షెడ్యూల్డ్ కులాలు, ఫెడ్యూల్డ్ తెగల ను రాష్ట్రాల వారీగా ఉప వర్గీకరించవచ్చని 2020లో జస్టిస్( రిటైర్డ్) అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే ఈ బెంచ్ తీసుకున్న అభిప్రాయం 2004లో ఇవి చిన్నయ్యవర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు భిన్నంగా ఉంది. ఈ తీర్పు ప్రకారం రాష్ట్రాలు ఏకపక్షంగాషెడ్యూల్డ్ కులాల తరగతిలో మ రో తరగతిని చేర్చడానికి అనుమతించడం అనేది రాష్ట్రపతి ఉంటుంది. ఒకే అంశంపై రెండు బెంచ్‌లు భిన్నమైన తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో ఈ అం శాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలని అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ఈ అంశంపై ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం విచారణ జరుపుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News