Tuesday, November 5, 2024

రేపు ఓటాన్ అకౌంట్

- Advertisement -
- Advertisement -

నాలుగు రోజుల పాటు సాగనున్న సమావేశాలు
బిఎసిలో మంత్రి శ్రీధర్‌బాబు, హరీశ్ మధ్య వాగ్వాదం
సభ్యులు కానివారు బిఎసికి రాకూడదని మంత్రి అభ్యంతరం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనభ బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజుల పాటు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బిఎసి) సమావేశంలో నిర్ణయించారు. ఈనెల 9, 10, 12, 13వ తేదీల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఫిబ్రవరి 9వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభ లో చర్చించనున్నారు. 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నెల 12, 13న బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ జరగనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత తొలిసారి కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మొట్టమొదటి బడ్జెట్ ఇది. గురవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బిఎసి సమావేశంలో ప్రభుత్వం తరుఫున సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొనగా,బిఆర్‌ఎస్ పార్టీ నుం చి కడియం శ్రీహరి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, బిజెపి నుంచి మహేశ్వర్‌రెడ్డి, సిపిఐ నుంచి కూనమనేని సాంబశివ రావు పాల్గొన్నారు.

బిఎసి సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు, బిఆర్‌ఎస్ ఎం ఎల్‌ఎ హరీశ్‌రావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బిఎసి సమావేశానికి బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత కెసిఆర్ స్థానంలో హరీశ్‌రావు హాజరుకాగా, బిఎసి జాబితాలో పేర్లు ఉన్న వారు మాత్రమే భేటీకీ రావాలని మంత్రి శ్రీధర్‌బాబు అనగా, సభాపతి అనుమతి ఇస్తేనే భేటీకి వచ్చానని హరీశ్‌రావు తెలిపారు. కొత్త సంప్రదాయం తగదని శ్రీధర్ బాబు అనడంతో గతంలోనూ వేరే వారు హాజరయ్యే సంప్రదాయం ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. తాను శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎంఐఎం, ఇతర పార్టీల సభ్యులు అందుబాటు లో లేకపోతే ఇతర సభ్యులకు అనుమతి ఇచ్చామని గుర్తు చేశారు. ఏదైనా కారణాల వల్ల ఒక పార్టీ తరపున ఒకరి స్థానంలో మరొకరు బిఎసి సమావేశానికి హాజరయ్యే సం ప్రదాయం లేదని నిరూపిస్తే తాను ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఇరువురి మధ్య స్పీకర్ జోక్యం చేసుకుని బిఎసి సమావేశాన్ని అర్థం చేసుకొని సహకరించాలని కోరడం తో హరీశ్‌రావు బిఎసి సమావేశం నుంచి బయటకు వచ్చారు.

ఎవరినీ వెళ్ళమని చెప్పలేదు : శ్రీధర్‌బాబు
తాము ఎవరిని బిఎసి సమావేశం నుండి వెళ్ళమని చెప్పలేదని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయం మేరకు బిఎసి సమావేశానికి బిఆర్‌ఎస్ నుండి ఇద్దరు సభ్యులకు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఇద్దరు ఎవరో నిర్ణయం తీసుకోండి చెప్పగా, బిఆర్‌ఎస్ నుండి కెసిఆర్, కడియం శ్రీహరి పేర్లు ఇచ్చారని చెప్పా రు. కెసిఆర్ రావడంలేదు కాబట్టి.. తాను వస్తా అని హరీష్‌రావు అన్నారని పేర్కొన్నారు. ఒక సభ్యుడు రావ డం లేదని ఇంకో సభ్యున్ని అనుమతివ్వరని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఒకరి బదులు ఇంకొకరు రావడం ఉండదని తెలిపారు. బిఆర్‌ఎస్ నుండి ఎలాంటి లేఖ రాలేదని వివరించారు. ఎన్ని రోజులైనా సభ నడుపుతామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
12 రోజులు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరాం : కడియం శ్రీహరి
సభను నాలుగు రోజులు కాకుండా కనీసం 12 రోజులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి తెలిపారు. బిఎసి సమావేశం ముగిసన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కడియం శ్రీహరి మాట్లాడారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నట్లు ప్రభుత్వం చెప్పిందని, తెలిపారు. అవసరమైతే 13వ తేదీన మరోసారి బిఎసి నిర్వహిస్తామని చెప్పారని కడియం శ్రీహరి వెల్లడించారు. త్వరగా బడ్జెట్ ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. నాలుగు రోజులు సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రజా సమస్యలు ప్రస్తావించే అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలపై నిలదీస్తారనే త్వరగా ము గించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రజలకిచ్చిన 420 హమీలను అసెంబ్లీలో బాజాప్తా ప్రస్తావిస్తామని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రొటోకాల్ వివాదం ఏర్పడుతోందని పేర్కొన్నారు. రాబో యే రోజుల్లో ఇది శాంతి భద్రతల సమస్యలకు దారి తీస్తుందని చెప్పారు. ముందు ప్రొటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూస్తామని సభాపతి, సిఎం హామీ ఇచ్చారని తెలిపారు. గ్యారంటీలు, హామీలపై నిలదీస్తారనే నాలుగే రోజులే సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News