Monday, December 23, 2024

పివికి భారత రత్న ప్రకటించడం హర్షణీయం : కోలేటి దామోదర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: గొప్ప రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా ప్రవీణుడు, మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావుకు భారత ప్రభుత్వం భారత రత్న ప్రకటించడం పట్ల తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ పివి తెలుగు నేత కావటం, అందులో తెలంగాణ బిడ్డ కావటం, ముఖ్యంగా తాను పుట్టి పెరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాడు కావటం తనకెంతో ఆనందదాయకంగా ఉందన్నారు. పివితో తనకు సుదీర్ఘమైన ఆత్మీయ అనుబంధం ఉందని, ఇంత కాలానికి పివి దేశానికి చేసిన సేవలకు గుర్తింపు లభించి, దేశ అత్యున్నత పురస్కారం ఆయనను వరించిందని పేర్కొన్నారు.

నాన్నకు భారత రత్న రావటం ఆనందంగా ఉంది : ఎమ్మెల్సీ సురభి వాణి దేవి
భారతదేశానికి తమ తండ్రి ఎన్నో సేవలందించారని, ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి పేర్కొన్నారు. ఇప్పుడు నా కల నెరవేరిందని, తెలంగాణ గడ్డ మీద పుట్టిన తొలి తెలుగు ప్రధాని మన పివి నరసింహారావుకు భారత రత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. పివికి భారత రత్నం ఇవ్వడంతో భారత రత్న విలువ మరింత పెరిగిందని, ప్రజల క్షేమమే తన జీవితమని భావించిన మహానీయుడని ప్రశంసించారు. ఆలస్యమైన పివికి భారత రత్న ఇవ్వడం తనకు గర్వంగా ఉందని, కుటుంబ సభ్యులమంతా ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పివి శత జయంతి ఉత్సవాలు కెసిఆర్ ఘనంగా నిర్వహించారని,పార్టీలకు అతీతంగా బిజెపి గుర్తించి భారత రత్న ఇవ్వడం ప్రధాని మోడీ సంస్కారంకు నిదర్శనమన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి ఒకరు ఈ నిర్ణయాన్ని స్వాగతించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News