Saturday, December 21, 2024

కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…యూసుఫ్‌గూడ, వెంకటగిరి లో ఉంటున్న యాదమ్మ(53) జిహెచ్‌ఎంసిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తోంది. యాదమ్మకు ఇద్దరు కుమారులు కాగా, ఇటీవలి కాలంలో ఓ కుమారుడు మృతిచెందాడు. ఈ క్రమంలోనే యాదమ్మ శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది.

ఇంట్లో ఎవరూ లేకపోవడంతో యాదమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యాదమ్మ మృతికి గల కారణాలు తెలియాలేదని, విచారణ చేస్తున్నామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News