Friday, November 22, 2024

నీట్ యుజి సెట్ నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ (నీట్ యుజి 2024) పరీక్షకు శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. ఈ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం(ఫిబ్రవరి) 9 నుంచి మార్చి 9 రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. నీట్ పరీక్ష మే 5న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది. ఎంబిబిఎస్, బిడిఎస్, బిఎస్‌ఎంఎస్, బియుఎంఎస్, బిహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఎన్‌టిఎ నీట్ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News