Saturday, December 21, 2024

వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

- Advertisement -
- Advertisement -

హోబర్ట్: వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన తొలి టి20లో ఆతిథ్య ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌లో ఆస్ట్రేలియా 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగులు చేసి కొద్ది తేడాతో ఓటమి పాలైంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్‌కు ఓపెనర్లు బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ధాటిగా ఆడిన చార్లెస్ 25 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42 పరుగులు చేశాడు.

కింగ్ 37 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 57 పరుగులు సాధించాడు. అయితే కీలక సమయంలో వీళ్లిద్దరూ ఔట్ కావడంతో విండీస్ తడబడింది. కానీ చివర్లో జేసన్ హోల్డర్ 15 బంతుల్లోనే 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 34 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జోష్ ఇంగ్లిస్ శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన వార్నర్ 36 బంతుల్లోనే 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 70 పరుగులు చేశాడు. ఇంగ్లిస్ ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో వేగంగా 39 పరుగులు సాధించాడు. చివర్లో టిమ్ డేవిడ్ 37 (నాటౌట్) దూకుడుగా ఆడడంతో ఆస్ట్రేలియా స్కోరు 213 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News