- Advertisement -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ
రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ మంత్రి మండలి శనివారం ఉదయం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగనుంది. ఉదయం 9 గంటలకు సచివాలయంలో జరుగనున్న ఈ భేటీలో రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్రవేయనుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శాసన సభలో డిప్యూటీ సిఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇది తొలి బడ్జెట్ కావడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
- Advertisement -