Thursday, December 19, 2024

సావర్కార్, బాల్ థాకరేలను మరిచారు: సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -

ముంబయి : భారత రత్న పురస్కారాల ప్రకటన సమయంలో హిందుత్వ ప్రముఖుడు, స్వాతంత్య్ర యోధుడు విడి సావర్కార్, శివ సేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేలను కేంద్ర ప్రభుత్వం ‘విస్మరించింది’ అని శివ సేన (యుబిటి) నేత, రాజ్య సభ సభ్యుడు సంజయ్ రౌత్ శుక్రవారం విమర్శించారు. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, ‘హరిత విప్లవం’ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌లకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం భారత రత్న పురస్కారాలు ప్రకటించిన విషయం విదితమే. ‘ప్రధాని నరేంద్ర మోడీ మాజ ప్రధాని పివి నరసింహారావు,

మాజీ ఉప ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త, భారత ఆహార విప్లవం పిత డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌లకు భారత రత్ప ప్రకటించినప్పుడు మరొక సారి సావర్కార్, థాకరేలను మరిచారు’ అని రౌత్ ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆక్షేపించారు. ఒక ఏడాదిలో ముగ్గురు వ్యక్తులకు భారత రత్న ప్రకటించడం పరిపాటి అని, కాని మోడీ ఐదుగురికి ప్రకటించారని రౌత్ వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికలే ఇందుకు కారణం కావచ్చునని రౌత్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News