Tuesday, April 15, 2025

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభమై కొనసాగుతోంది. అసెంబ్లీ కమిటీహాల్ లో మంత్రివర్గం సమావేశమైంది. మంత్రి మండలి బడ్జెట్‌ను ఆమోదం తెలపనుంది. ఇరిగేషన్‌శాఖపై శ్వేతపత్రం, విజిలెన్స్‌ నివేదికపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉభయసభల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో డిప్యూటీ సిఎం భట్టి విక్కమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News