Saturday, December 21, 2024

అమెరికాలో మరో దారుణం: భారతీయ సంతతి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

వివాదాల్లోనూ, అనుమానాస్పద పరిస్థితుల్లోనూ అమెరికాలో మరణిస్తున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల జాబితాలో మరొకరు చేరారు. వాషింగ్టన్ లోని ఒక రెస్టారెంట్ లో జరిగిన ఘర్షణలో వివేక్ తనేజా అనే వ్యక్తి చనిపోయాడు. ఫిబ్రవరి 2వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వర్జీనియాకు చెందిన వివేక్ తనేజాతో ఒక వ్యక్తి రెండో తేదీ రాత్రి వాషింగ్టన్ లోని ఒక రెస్టారెంట్ వద్ద ఘర్షణ పడ్డాడు. అతను వివేక్ పై పంచ్ విసరడంతో వివేక్ కిందపడ్డాడు. అతని తల పేవ్ మెంట్ కు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు వచ్చి, వివేక్ ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. హంతకుడి ఆచూకీ తెలియరాలేదు. హంతకుడి ఆచూకీ చెబితే 25వేల డాలర్ల బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

ఇటీవలి కాలంలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులపై అమెరికాలో దాడులు ఎక్కువయ్యాయి. చికాగోలో సయ్యద్ అలీ అనే యువకుడిపై ముగ్గురు దుండగులు దాడి చేసి, తీవ్రంగా కొట్టి, అతని వద్ద సెల్ ఫోన్ ను ఎత్తుకుపోయారు. మరొక సంఘటనలో సిన్సినాటీలో శ్రేయాస్ రెడ్డి బెనిగరి అనే యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. శ్రేయాస్ మృతికి కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు. పర్డ్యూ యూనివర్శిటీలో చదువుకుంటున్న నీల్ ఆచార్య అనే యువకుడు కూడా అనుమానాస్పద పరిస్థితుల్లోనే కన్నుమూశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News