ఢిల్లీ: గత 10 పదేళ్ల బిజెపి పాలనలో దేశం అద్భుత ప్రగతి సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మా ప్రభుత్వంలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చామని.. దాదాపు 20 కోట్ల మందిని పేదరికాన్ని జయించారని చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు అనేక చర్యలు తీసుకున్నామని మోడీ తెలిపారు.
శనివారం లోక్ సభలో ప్రధాని మాట్లాడుతూ.. కరోనా లాంటి విపత్కర పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. కరోనా సమయంలో ఎంపీలు తమ జీతాన్ని బాధితులకు ఇచ్చి ప్రజలకు అండగా నిలబడ్డారని చెప్పారు. దేశ ప్రజలకు కోరిక మేరకు అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కృషి చేశామని చెప్పారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించుకున్నామన్నారు.
పేపర్ లీకేజ్‌కు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా చట్టం తీసుకొచ్చామని.. వికసిత్ భారత్ ఫలితాలు భావితరాలకు అందుతాయని ఆయన అన్నారు. జీ20 సమావేశాలను నిర్వహించి భారత్ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేశామన్నారు. మూడోసారి కూడా మేమే అధికారంలో ఉంటామని.. ఎన్నికలు రాకమందే కొందరికి అప్పుడే టెన్షన్ మొదలైందని ప్రధాని అన్నారు.