Friday, December 20, 2024

దుబాయ్‌లో రూ.33 కోట్లు జాక్‌పాట్ కొట్టిన కేరళీయుడు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేరళకు చెందిన 40 ఏళ్ల రాజీవ్ అరిక్కట్ దుబాయ్ లోని లాటరీ టికెట్‌లో రూ.33 కోట్లు (15 మిలియన్ దిర్హామ్‌లు) జాక్‌పాట్ సాధించగలిగాడు. బిగ్ టికెట్ అబుధాబీ వీక్లీ డ్రాలోఆయనకు అదృష్టం వరించింది. రాజీవ్ తన టికెట్ నెంబరు 037130పై ఇంత భారీ మొత్తం రావడం తన జీవితాన్నే ఒక్క క్షణంలో మార్చేసింది. ఈసారి తన భార్యతో కలిసి 7,13 టికెట్ నెంబర్లను ఎంచుకున్నాడు. ఆ నెంబర్లు తన పిల్లల పుట్టిన రోజు తేదీలు కావడం విశేషం. రెండు నెలల క్రితం కొన్న లాటరీ టికెట్ ద్వారా ఒక మిలియన్ దిర్హామ్ వచ్చినట్టే వచ్చి అదే కాంబినేషన్ నెంబరు మరో వ్యక్తికి రావడంతో చేజారింది. ఈసారి ఆరు టికెట్లు కొనగా, కాంప్లిమెంటరీ టికెట్‌పై అదృష్టం అందడం విశేషం.

యుఎఇలోని అల్ ఎయిన్ లో ఆర్కిటెక్చరల్ సంస్థలో గత పదేళ్లుగా పనిచేస్తున్న అరిక్కట్ గత మూడేళ్లుగా అదృష్టం అందుతుందన్న ఆశతో బిగ్ టికెట్ లాటరీ టికెట్లను కొనుక్కోవడం పరిపాటి అయింది. ఆయన తన భార్య ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. ఈ జాక్‌పాట్‌తో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఐదు, ఎనిమిది సంవత్సరాల వయసున్న ఇద్దరు పిల్లలతో పుట్టిన రోజు వేడుకలతో సంబరపడుతున్నాడు. ఈ అదృష్టాన్ని మొత్తం 19 మందికి సమానంగా పంచాలని ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఆనందాన్ని తోటివారితో భారీ వేడుకల ద్వారా పంచుకోవాలని చూస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News