Saturday, December 21, 2024

ఎంఎల్ఎ హరీష్‌రావు నిజంగా పాపాల భైరవుడే: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎమ్మెల్యే హరీష్‌రావు నిజంగా పాపాల భైరవుడే అని, హరీష్ రావు పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అని జగ్గారెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు. గాంధీ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హరీష్ రావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎత్తులు, అపొజిషన్‌లో ఉన్నప్పుడు నీతులు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సిఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఇరిగేషన్‌పై సమీక్ష చేస్తుంటే హరీష్‌రావుకు నిద్ర పట్టడం లేదన్నారు. 2018 ఎన్నికల ముందు హరీష్ రావు రూ.5000 కోట్లను దాచి పెట్టినట్టు తన వద్ద సమాచారం ఉందన్నారు. ముఖ్యమంత్రి కావడానికి హరీష్ రావు ఈ డబ్బును సిద్ధం చేసి పెట్టాడని ఆయన ఆరోపించారు. హరీష్ రావు ఈ డబ్బును ఎక్కడ దాచిపెట్టాడో బయటపెట్టాలని సిఎంకు లేఖ రాస్తానన్నారు. ఈఎన్సీ హరిరామ్ దగ్గర హరీష్ రావు డబ్బులు ఉన్నాయని, రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక హరీష్ రావుకు సంవత్సరం దాకా మంత్రి పదవి ఇవ్వలేదని, గత ప్రభుత్వ తప్పులన్నీ బయట పెడతామని ఆయన పేర్కొన్నారు.

ఇది ఆరంభం మాత్రమేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు. హరీష్ రావు రూ.5వేల కోట్లు, కవిత, సంతోష్ కొన్ని వేల కోట్లు బ్లాక్ చేశారని, కెసిఆర్ కుటుంబం డబ్బులు బ్లాక్ చేయడం వల్ల మార్కెట్లో డబ్బులు కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ ఉచిత బస్సు పెట్టడంతో మేడారంలో భక్తుల సంఖ్య పెరిగిందన్నారు. గత ప్రభుత్వంలో ప్రజల సొమ్మును కెసిఆర్ అనుభవించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల సొమ్ము ప్రజలే అనుభవిస్తున్నారన్నారు. కెసిఆర్ కుటుంబంపై ఐటీ, ఈడీ దాడులు జరగవని, కిషన్ రెడ్డికి పౌరుషం లేదని, సైలెంట్‌గా ఉన్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డికి పౌరుషం ఉందని, సుమన్ లాంటివాళ్లు ఇంకోసారి ఇలా చేస్తే మేం డైరెక్ట్ వెళ్లి కొడతామని జగ్గారెడ్డి హెచ్చరించారు. తిట్ల పురాణానికి కెసిఆర్ గురువు అని, కానీ, కాంగ్రెస్ వాళ్లు కెసిఆర్‌కే గురువులని ఆయన తెలిపారు. మీ ఆశీర్వాదం వల్లే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు. దేశంలోనే తెలంగాణ మోడల్ పాలనపై చర్చ జరిగేలా పరిపాలన అందిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News