Monday, December 23, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని ప్రధాన రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును వెనకాల నుంచి ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో రెండు కార్లు పల్టీ కొడుతూ కల్వర్టు లోకి దూసుకెళ్లి నుజ్జు నుజ్జయ్యాయి. రెండు కార్లలో నలుగులు వ్యక్తులు ఉన్నట్టు సమాచారం. నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం ఎయిర్ పోర్ట్ ప్రదాన దారిలో జరగడంతో అధికారులు వాహన ప్రయాణికులు బెంబేలెత్తారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News