Monday, December 23, 2024

రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి ఎంపి సీటును కాంగ్రెస్ నుంచి ఆశిస్తున్న బొంతు రామ్మోహన్

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్న బిఆర్‌ఎస్ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు వరుసగా సిఎంతో భేటీ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. మరో కీలక నేత ఆదివారం సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మర్యాదపూర్వకంగా సిఎంను కలిశారు.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో బొంతు రామ్మోహన్ బిఆర్‌ఎస్ నుంచి ఉప్పల్ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం మరోసారి బిఆర్‌ఎస్ నుంచి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. లోక్‌సభ సీటు కూడా దక్కే ఛాన్స్ లేకపోవడంతో పార్టీ మారాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సిఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బొంతు రామ్మోహన్ మల్కాజిగిరి టికెట్‌ను ఆశిస్తున్నట్టుగా సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News