Saturday, January 18, 2025

రనౌట్… కానీ ఔట్ ఇవ్వలేదు! (వీడియో)

- Advertisement -
- Advertisement -

అడగందే అమ్మయినా పెట్టదంటారు. అలాంటిది అంపైర్ మాత్రం ఎలా అవుటిస్తాడు? ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మధ్య అడిలైడ్ లో జరిగిన టి20 మ్యాచ్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తుండగా 18వ ఓవర్లో మూడో బంతిని విండీస్ బ్యాటర్ అల్జరీ జోసెఫ్ కవర్స్ వైపుకు కొట్టి, పరుగు తీశాడు. ఈలోగా ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ బంతిని వికెట్ల దగ్గరున్న జాన్సన్ కు అందించాడు. జాన్సన్ వెంటనే వికెట్లను పడగొట్టాడు. అప్పటికి ఇంకా క్రీజ్ చేరుకోని జోసెఫ్ రనౌట్ అయ్యాడు. ఆసీస్ ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకోవడంలో మునిగిపోయారు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అదేంటంటే ‘మీరు అప్పీల్ చేయలేదుగా?’ అని అంపైర్ గెరార్డ్ అబూద్ ప్రశ్నించడంతో ఆసీస్ ఆటగాళ్ళు ఆశ్చర్యపోయారు.

నిబంధనల ప్రకారం అప్పీల్ చేయకపోతే ఔట్ ఇవ్వడం కుదరదని అంపైర్ మొండికేయడంతో ఆసీస్ ఆటగాళ్లు చేసేదేం లేక ఆట కొనసాగించారు. విండీస్ బ్యాటర్ జోసెఫ్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. కొసమెరుపు ఏంటంటే… ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టే గెలిచింది.

కామెంటరీ బాక్స్ లో ఉన్న మాజీ ఆస్ట్రేలియా బ్యాటర్ మైకేల్ హస్సీ కూడా బ్యాటర్లనే తప్పుపట్టాడు. అంపైర్ నిర్ణయాన్ని గౌరవించి, ఆటను కొనసాగించాల్సిందేనంటూ హితవు చెప్పాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News