Friday, November 22, 2024

సుప్రీం ధర్మాసనంలో ఐసిజె న్యాయమూర్తి న్యాయ కార్యకలాపాల వీక్షణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసిజె) న్యాయమూర్తి హిలరీ చార్లెస్‌వర్త్ సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంలో ఆశీనులై న్యాయ కార్యకలాపాలను వీక్షించారు. మన న్యాయస్థానాన్ని సందర్శించిన ఐసిజె న్యాయమూర్తి హిలరీ చార్లెస్‌వర్త్‌కు సిజెఐ చంద్రచూడ్ సాదర స్వాగతం పలికారు. ఆమె గతంలో న్యూఢిల్లీలోని మాయో కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేశారని ఆయన తెలిపారు. భారత్‌కు మిత్రురాలైన చార్లెస్‌వర్త్ న్యాకోవిదులని ఆయన వివరించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఆమెకు స్వాగతం పలికారు. ఆస్ట్రేలియాకు చెందిన అంతర్జాతీయ న్యాయవాది అయిన చార్లెస్‌వర్త్ 2021 నవంబర్ 5 నుంచి ఐసిజె న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో శనివారం ఆమె అంతర్జాతీయ న్యాయస్థానంపై రెండవ వార్షిక ఉపన్యాసాన్ని అందచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News