Monday, December 23, 2024

వాలెంటెన్స్ డే అడ్డుకొని కల్తీ ప్రేమను ఎండగడతాం: భజరంగ్ దళ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ప్రజలు వాలంటైన్స్ డే ను వ్యతిరేకించాలని, కల్తీ ప్రేమను ఒలకబోసే ప్రేమికులను అడ్డుకుని తీరుతామని భజరంగ్‌దళ్ హెచ్చరించింది.  ఆబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ ఎదుట సోమవారం వాలెంటైన్స్ డే గ్రీటింగ్స్ ను భజరంగ్‌ధళ్ కార్యకర్తలు దహనం చేశారు. విదేశీ సంస్కృతి నశించాలని,స్వదేశీ సంప్రదాయాన్ని పెంచి పోషించాలని, విదేశీ మాఫియాను తరిమికొట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి మాట్లాడుతూ స్వదేశీ సంప్రదాయాన్ని పరిరక్షణ కోసం ఎంతకైనా పోరాడుతామన్నారు. ఓయో రూములతో సహా పార్కులు, సినిమా టాకీస్ లో, బేకరీలలో వాలెంటెన్స్ ను ప్రోత్సహిస్తూ ఈవెంట్స్ కండక్ట్ చేస్తే కచ్చితంగా అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను 14వ తేదీన ఇళ్లలో నుంచి బయటకు పంపవద్దని, వారి సెల్ ఫోన్లను అప్రమత్తతలో ఉంచాలని సూచించారు. భజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్ అనేది ప్రేమకు వ్యతిరేకం కాదని వాలెంటెన్స్ డే కు మాత్రమే వ్యతిరేకమని తేల్చి చెప్పారు. కార్పొరేట్ వ్యాపారస్తులు తమ స్వలాభం కోసం, వ్యాపార విస్తరణ కోసం లవర్స్ డే ను పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. పబ్బులు, క్లబ్బులు, హోటల్స్, లాడ్జీలలో ఈవెంట్స్ కండక్ట్ చేస్తే ఎట్టి పరిస్థితిలో అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో భజరంగ్ దళ్ నాయకులు మహేశ్ యాదవ్, శంకర్, అభిలాష్, అఖిల్, నిఖిల్, రాహుల్, సుమంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News