Tuesday, January 21, 2025

రూ.16 లక్షల విలువైన 64 కిలోల గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

చేవెళ్ల ః రంగారెడ్డి జిల్లా, చేవెళ్లలో పోలీసులు సోమవారం రూ.16 లక్షల విలువైన 64 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సిఐ లకా్ష్మరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన చిత్ర కైలాష్‌మోహిత్ (35), నవనత్ గణపత్ చౌహాన్ (70), మదన్‌బాల సాహెబ్ బయాస్ (38), మైనర్ రాజేష్ సుభాష్ మోహిత్ (15) గ్రూపుగా ఏర్పడి గత కొన్ని రోజులుగా ఒడిశా రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారు. సొంత వాహనాల్లో కాకుండా లారీల ద్వారా ప్రయాణం చేస్తూ గంజాయిని తరలిస్తున్నారు. ఇదే క్రమంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో శంకర్‌పల్లి చౌరస్తాలో లారీ నుంచి గంజాయిని దించి సంగారెడ్డి వైపు వెళ్లే లారీలోకి ఎక్కిస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

వారిని పట్టుకుని విచారించగా గంజాయిని తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి 32 బ్యాగుల్లోని 64 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.16 లక్షల ఉంటుందని పోలీసులు వెల్లడించారు. నిందితులను నుంచి రెండు సెల్‌ఫోన్లు, రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న వారిలో సిఐ లకా్ష్మరెడ్డి, ఎస్‌ఐ వీరబ్రహ్మం, హెడ్ కానిస్టేబుల్ శంకర్, రాజేంద్రనగర్ ఎస్‌ఓటి పోలీసు సిబ్బంది ఉన్నారు. నిందితులను పట్టుకున్న రాజేంద్రనగర్ ఎస్‌ఓటి, చేవెళ్ల పోలీస్ సిబ్బందిని శంషాబాద్ డిసిపి, చేవెళ్ల ఏసిపి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News