Thursday, December 19, 2024

గవర్నర్ కోటా ఎంఎల్‌సిల విచారణ వాయిదా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :  రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎంఎల్‌సిలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను నామినేట్ చేసింది. దీంతో ప్రభుత్వానికి అనుకూలంగా గవర్నర్ వారిద్దరిని ఎంఎల్‌సిలుగా ప్రకటించింది. అయితే గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారయణలను ఎంఎల్‌సి అభ్యర్థులుగా నామినేట్ చేసింది. అయితే వీరు రాజకీయ పార్టీలకు చెందిన వారు కావడంతో గవర్నర్ తమిళిసై గత ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన వారిలో కోదండరామ్ ఓ పార్టీ అధ్యక్షుడు కావడంతో దాసోజు శ్రవణ్ కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు గవర్నర్ కోటా ఎంఎల్‌సిల ప్రమాణ స్వీకారాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ పిటిషన్‌పై సోమవారం విచారించిన హైకోర్టు మరోసారి స్టేటస్ కో ఉత్తర్వులను ఈ నెల 14 వరకు పొడిగించింది. అలాగే తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News