- Advertisement -
రాజకీయలబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ సందర్శన చేపట్టిందని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. మేడిగడ్డలో తప్పు జరిగితే చర్యలు తీసుకోండి.. ప్రాజెక్టును పునరుద్ధరించడంని అన్నారు. మంగళవారం అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా.. శాసనసభలో సభా సంప్రదాయాలను ఉల్లంఘించారని విమర్శించారు. బ్యారేజీ పిల్లర్లు కుంగితే ఇష్యూ చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు.
కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదన్నారు. కాళేశ్వరం అంటే.. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్.. వీటన్నింటి సమాహారం కాళేశ్వరమని చెప్పారు.
- Advertisement -