Friday, December 20, 2024

మేడిగడ్డ సందర్శనకు బిఆర్ఎస్, బిజెపి దూరం..

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలందరూ నాలుగు బస్సుల్లో మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయల్దేరి వెళ్లారు. అయితే, మేడిగడ్డ సందర్శనకు కాంగ్రెస్‌ పార్టీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యే వెళ్లారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించి బస్సులను కూడా ఏర్పాటు చేసినా.. బిఆర్ఎస్, బిజెపి ఎమ్మెల్యేలు మాత్రం వెళ్లలేదు.

ఈరోజు సాయంత్రం 4గంటలకు కెసిఆర్ నేతృత్వంలో ఛలో నల్గొండ పేరుతో బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్గొండకు పయనమయ్యారు. ఇక.. ప్రభుత్వానికి, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు సమాన దూరంగా ఉండాలని బిజెపి నిర్ణయించింది. దీంతో బిజెపి ఎమ్మెల్యేలు మేడిగడ్డ సందర్శనకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News