- Advertisement -
పరిస్థితి విషమం
సంతోష్ నగర్ సర్కిల్ 7… సంతోష్ నగర్ డివిజన్.. .కలంద నగర్ లో ఘటన
హైదరాబాద్: సంతోష్ నగర్ డివిజన్ కలంద నగర్ లోని ఓ వ్యక్తి జిహెచ్ఎంసి అనుమతులకు విరుద్ధంగా ఏడు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాడు. గత మూడు రోజుల క్రితం ఓ కార్మికుడు నిర్మాణ పనులు చేస్తుండగా భవనం పైనుంచి కింద పడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఒవైసి ఆస్పత్రికి తరలించారు. ఈ అక్రమ భవన నిర్మాణంపై టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. సంతోష్ నగర్ డివిజన్ లో చాలా వరకు అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. అవినీతి అధికారుల జేబులు నిండుతుండడంతో ఎవరు పట్టించుకోకపోవడంతో జిహెచ్ఎంసి నష్టపోతుంది. ఇప్పటికైనా జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు అక్రమ భవన నిర్మణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు
- Advertisement -