Friday, November 15, 2024

కాళేశ్వరంతో లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంఎఎల్ఎల బృందం కాళేశ్వరంలో పర్యటించి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సిఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు నీరు అందలేదని, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని అబద్ధాలు చెప్పారని చురకలంటించారు. మేడిగడ్డ నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ చెప్పిందని గుర్తు చేశారు. ఇప్పటివరకు కెసిఆర్ అబద్ధాలతోనే కాలం గడిపారని, 2020-21లోనే సమస్య ఉందని ఇంజినీర్లు చెప్పినా కూడా కెసిఆర్ పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సమస్యను చక్కదిద్దే పని చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తారా? అని ప్రశ్నించారు.

రూ.94 వేల కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చిందని 98,570 ఎకరాలకు మాత్రమేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ బిల్లులే రూ.10,500 కోట్లు వస్తుందని, కాళేశ్వరం రుణాలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా రూ.25 వేల కోట్లు అవసరం అవుతాయని, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన ఏ బ్యారేజీలోనూ ఇప్పుడు నీరు లేదని, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో ఒకే తరహా సమస్య ఉత్పన్నమవుతుందని, ప్రస్తుతం సీపేజీ చేసి అన్నారం, సుందిళ్లలో సమస్యను కప్పిపుచ్చారని, వానాకాలం వస్తే సుందిళ్ల, అన్నారంలో కూడా సమస్యలు బయటపడుతాయని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నీళ్లు నింపితే ఇష్యూ వస్తుందని బ్యారేజీల్లో నీళ్లు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News